ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువత స్వయంగా శక్తితో ఎదగాలి: ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 02:44 PM
యువత స్వయంశక్తితో ఎదగాలి అని దేవరకొండ శాసన సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం చింతపల్లి మండలం మాల్ పట్టణంలో బస్ స్టాండ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన అక్షర మొబైల్ షాప్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. యువతకు అండగా ప్రభుత్వం ఉంటుందని ఆయన అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, బాదేపల్లి పులిరాజు, బాదేపల్లి నిరంజన్, పోషయ్య తదితరులు పాల్గొన్నారు.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com