ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీల అభివృద్ధి: ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 02:41 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. కాలనీలో ఎటువంటి సమస్యలన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తంగ లక్ష్మారెడ్డి, సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొండల శ్రీనాథ రావు, జనరల్ సెక్రెటరీ కామ్రేడ్ సత్యం తదితరులు పాల్గొన్నారు.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com