మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని కౌకుంట్ల గ్రామాన్ని కొత్త రెవెన్యూ మండలంగాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గతంలో ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి సోమవారం తుది ఉత్తర్వులతో కౌకుంట్ల గ్రామాన్ని కొత్త రెవెన్యూ మండల హోదా ఇస్తూ తుది రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేవరకద్ర నియోజకవర్గం లోని చిన్నచింతకుంట మండలంలోని నాలుగు గ్రామాలు, దేవరకద్ర మండలంలోని ఎనమిది గ్రామాలను కలుపుకొని మొత్తం 12 గ్రామాలతో నూతన మండలం ఏర్పాటు చేయడం జరిగింది.