ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రహ్మాజీ తో 'అలనాటి రామచంద్రుడు' టీమ్ ఇంటర్వ్యూ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 22, 2024, 06:46 PM

చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వంలో 'అలనాటి రామచంద్రుడు' సినిమాతో కృష్ణవంశీ తెలుగు ఇండస్ట్రీలో తెరంగేట్రం చేస్తున్నాడు. తాజాగా మూవీ టీమ్ ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా బ్రహ్మాజీతో ఇంటర్వ్యూని చేసారు. ఈ పూర్తి ఇంటర్వ్యూ ని మూవీ మేకర్స్ విడుదల చేసారు. ఈ చిత్రంలో మోక్ష కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సీనియర్ నటి సుధ, ప్రమోధిని, వెంకటేష్ కాకమును, చైతన్య గరికిపాటి కూడా కీలక పాత్రలో నటించారు. శశాంక్ తిరుపతి స్వరాలు సమకూర్చగా, ప్రేమ్ సాగర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ ప్రేమకథని హైనివా క్రియేషన్స్ బ్యానర్‌పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మించారు. ఈ సినిమా ఆగష్టు 2, 2024న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com