పాన్ ఇండియా సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ చేస్తున్న చిత్రం "సలార్". ఇద్దరు పాన్ ఇండియా స్టార్ల కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డెబ్బైశాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే షూటింగ్ కి ఎండ్ కార్డు పలకబోతుంది. సెప్టెంబర్ 28వ తేదీన పాన్ ఇండియా భాషల్లో సలార్ మ్యానియా మొదలుకాబోతుంది.
అయితే, తాజా బజ్ ప్రకారం, సలార్ థియేట్రికల్ హక్కుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని తెలుస్తుంది. సలార్ థియేట్రికల్ రైట్స్ ని ఒక్క ఆంధ్రప్రదేశ్ కే 100కోట్ల భారీ ధరకు మేకర్స్ అమ్మాలని చూస్తున్నారట. ఐతే, డీల్ ఇంకా క్లోజ్ అవ్వలేదంట. దీంతో , డార్లింగ్ అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువవుతున్నాయి.