ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ నుండి మరొక న్యూ మూవీ ఎనౌన్స్మెంట్ ..?

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2023, 03:21 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం సినీ రాజకీయ రంగాలలో క్షణం తీరిక లేకుండా ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఒక పక్క చేతినిండా సినిమాలు, మరోపక్క ఎలక్షన్స్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ నుండి మరొక న్యూ మూవీ ఎనౌన్స్మెంట్ రాబోతుందనే లేటెస్ట్ వైరల్ న్యూస్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది. హరి హర వీరమల్లు, PKSDT ఆల్రెడీ సెట్స్ పై ఉండగా, OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు వచ్చే నెల నుండి పట్టాలెక్కుతాయి. పవన్ బిజిషెడ్యూల్ లో ఈ సినిమాలను పూర్తి చెయ్యడమే గగనం.. అనుకుంటుండగా, కబ్జా డైరెక్టర్ R. చంద్రు తో పవన్ మరొక న్యూ మూవీని ఎనౌన్స్ చెయ్యబోతున్నారనడంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఐతే, చంద్రు - పవన్ల రీసెంట్ మీటింగే ఈ ప్రచారానికి కారణమని తెలుస్తుండగా, వీరిద్దరి కలయికలో సినిమా రాబోతోందా..?అనే విషయం తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com