మాస్ అమ్మ మొగుడు ..మాస్ కా దాస్ కోసం రాబోతున్న విషయం తెలిసిందే కదా. అంటే, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ న్యూ మూవీ "దాస్ కా ధమ్కీ" ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు రాబోతున్నారు. ఈ న్యూస్ ఎప్పుడైతే, అఫీషియల్ అయ్యిందో అప్పటి నుండి ఫ్యాన్స్ లో ఎదురుచూపులు మొదలయ్యాయి. తదుపరి నాటు నాటు ఆస్కార్ అందుకోవడం తో ఈ ఈవెంట్ పై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఎందుకంటే, ఆస్కార్ ఈవెంట్ తదుపరి నేరుగా ఈ ఈవెంట్ తోనే తారక్ పబ్లిక్ అప్పియరెన్స్ ఇస్తున్నారు మరి. ఈ ఈవెంట్ లో తారక్ ఏం మాట్లాడతారు? న్యూ మూవీ విశేషాలేమైనా పంచుకుంటారా..? అని ప్రేక్షకాభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
పోతే, ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం ఆరింటి నుండి హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో జరుగుతుంది.