ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతి త్వరలోనే మెగాఫ్యామిలీలో పెళ్ళిసందడి ..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 10:54 AM

యంగ్ అండ్ డైనమిక్ మెగా హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'ముకుంద' సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆపై  2017లో వచ్చిన 'ఫిదా' సినిమాతో తొలి కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. ఆపై లీడ్ హీరోగా తొలిప్రేమ, గడ్డలకొండ గణేష్, F2, F 3 సినిమాలలో నటించి సూపర్ హిట్స్ అందుకున్నారు. మెగాఫ్యామిలీలో సక్సెస్ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారు.


తాజా సమాచారం ప్రకారం, అతి త్వరలోనే వరుణ్ పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు గారు మాట్లాడుతూ.. కొన్నాళ్ల నుండి వరుణ్ కి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని, త్వరలోనే తన పెళ్లి విషయంపై వరుణ్ స్వయంగా ప్రకటిస్తారని చెప్పుకొచ్చారు. దీంతో మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి చూడాలని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com