'సర్కారువారిపాట' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమా (SSMB 28) చెయ్యబోతున్నారన్న విషయం తెలిసిందే కదా. అధికారికంగా ప్రకటన జరిగినప్పటి నుండి ఈ సినిమాపై పలువార్తలు చిత్రసీమలో జోరుగా ప్రచారం చెయ్యబడుతున్నాయి. అతడు, ఖలేజా సినిమాల తర్వాత దాదాపు పదకొండేళ్ల కు మళ్ళీ మహేష్ - త్రివిక్రమ్ కాంబో పట్టాలెక్కడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ మూవీపై లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, వచ్చే నెల రెండవ తారీఖు నుండి సెట్స్ పైకి వెళ్లబోతుందట. దీంతో ఫైనలైజ్ చేసిన స్క్రిప్ట్ ను మరొక్కసారి త్రివిక్రమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడంట. SVP మూవీ సూపర్ హిట్టే.., కానీ ఆ మూవీ స్క్రిప్ట్ లో కొన్ని లూప్ హోల్స్ ఉండడంతో తన సినిమాలో అలాంటి తప్పిదాలు జరగకూడదని త్రివిక్రమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఒక భారీ యాక్షన్ సీక్వెన్సెస్ తో మొదలు కాబోతున్న షూటింగ్ కు సంబంధించి సెట్స్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయట.