ట్రెండింగ్
Epaper    English    தமிழ்

థియేటర్లో ముగిసిన ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ... ఓటిటిలో నేటినుండే

cinema |  Suryaa Desk  | Published : Fri, May 27, 2022, 12:28 PM

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార బాయ్ ఫ్రెండ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కాతువాకుల రెండు కాదల్. తెలుగులో కన్మణి రాంబో ఖతీజా గా విడుదలైంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, నయనతార, సమంత ల మధ్య నడిచే ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ని విఘ్నేష్ ఫన్నీగా తెరపై ఆవిష్కరించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 28న విడుదలైన ఈ చిత్రం తమిళనాట మంచి వసూళ్లు రాబట్టింది. తెలుగులో ఈ సినిమాను పట్టించుకున్న వారే లేరు. దీంతో ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం చాలామంది తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తాజాగా నేటి నుండి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ లో అందుబాటులోకి వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కి స్టార్ కంపోజర్ అనిరుద్ చార్ట్ బస్టర్ సాంగ్స్ ని అందించారు. నయన్ - విఘ్నేష్ ల సొంత నిర్మాణ సంస్థ ది రౌడీ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com