ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాని జెర్సీ పై విదేశీయుల ప్రశంసలు ... గొప్ప సినిమా అంటూ ట్వీట్లు

cinema |  Suryaa Desk  | Published : Fri, May 27, 2022, 12:25 PM

నాని నటించిన అన్ని సినిమాలలో జెర్సీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో నాని నటించిన జెర్సీ విమర్శకుల ప్రశంసలను అందుకోవటంతో పాటు, జాతీయ పురస్కారాన్ని కూడా అందుకుంది. అదే టైటిల్ తో హిందీలో షాహిద్ కపూర్ ఈ సినిమాను రీమేక్ చేసారు. హిందీలో కూడా గౌతమ్ తిన్ననూరి నే దర్శకత్వం వహించారు. కరోనా మరియు ఇతరత్రా కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఇటీవలే విడుదలై, ఒక ఫీల్ గుడ్ మూవీ గా నిలిచింది. థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం ఓటిటిలో సందడి చేస్తున్న హిందీ జెర్సీని చూసిన ఒక వేదేశీయుడు సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఆ విదేశీయుడు ఎవరో కాదు... పాకిస్థానీ క్రికెట్ ఆటగాడు మొహమ్మద్ అమీర్. జెర్సీ సినిమాను చూసిన అమీర్ ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియచేసాడు. షాహిద్ కపూర్ ఎంత అందమైన, ఆదర్శవంతమైన సినిమా తీసావు !...గ్రేట్ వర్క్ బ్రదర్ ...  అంటూ ట్వీట్ చేసాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com