బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సూపర్ హీరో తరహా మూవీ లో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతేడాదిలోనే షూటింగ్ పూర్తవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యమైంది. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇంకా పూర్తి కానందున ఈ సినిమాని సెప్టెంబర్ 9న విడుదల చేయటానికి ముహూర్తం ఖరారు చేసారు.
కాన్సెప్ట్ నచ్చి తెలుగులో ఈ సినిమా ను సమర్పించేందుకు టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి పూనుకోవటం తో తెలుగులో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రీతమ్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. తాజాగా ఈ సినిమా నుండి కుంకుమలా... అనే పాట టీజర్ విడుదలయ్యింది. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ గీతంగా ఉండనున్న ఈ పాటను సిద్ధ్ శ్రీరామ్ తన మెలోడియస్ గొంతుతో పాడి శ్రోతలను వేరే ప్రపంచలంలోకి తీసుకువెళ్లారు.