ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో చేస్తోన్న భారీ పాన్ ఇండియా సినిమా “ఏ- ఆది పురుష్”. ‘ఆదిపురుష్’ సినిమాకి సంబంధించి డైరెక్టర్ ఓం రౌత్ ఎలాంటి అప్ డేట్ రివీల్ చేయడం లేదని, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సీరియస్ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే, తాజా అప్ డేట్ ప్రకారం.. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్ డేట్ రాబోతుంది. మరీ ఆ అప్ డేట్ ఏమిటో చూడాలి.ఇక ఈ చిత్రం కోసం ప్రభాస్ చాలా సవాళ్లను ఫేస్ చేశాడు. రాముడి పాత్రలో కనిపించడానికి ప్రభాస్ చాలా రకాలుగా కష్టపడ్డారు. ముఖ్యంగా విలువిద్యలో ప్రభాస్ శిక్షణ కూడా తీసుకున్నారు. పైగా విలుకారుల దేహదారుఢ్యం ‘వి’ షేప్ లో ఉంటారు. అంటే భుజాలు విశాలంగా, నడుము భాగానికి వచ్చేసరికి సన్నగా ఉంటుంది. ప్రభాస్ తన ఆకృతిని ఇలాగే మార్చుకున్నారు.
అలాగే, డైలాగ్స్ విషయంలో కూడా చాలా సాధన చేశారు. అందుకే ‘ఆదిపురుష్’గా ప్రభాస్ పర్ఫెక్ట్ యాప్ట్ గా ఉంటాడని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో కృతీ సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, అదే విధంగా లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. జనవరిలో ఈ చిత్రం విడుదల కాబోతోంది.