ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పృథ్విరాజ్' నుండి మఖ్మలీ సాంగ్ ప్రోమో రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 04:25 PM

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న చారిత్రక నేపధ్య చిత్రం పృథ్విరాజ్. ఈ చిత్రంలో 2017 ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సంజయ్ దత్, సోనూసూద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను ఎక్కడా రాజి పడకుండా చాలా గ్రాండ్ గా తెరకెక్కించింది. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషలలో జూన్ 3న విడుదల కానుంది. ఇటీవలనే ఈ మూవీ నుండి హరహర్ అనే లిరికల్ సాంగ్, రాయల్ హోలీ సాంగ్ ప్రోమో విడుదలవగా, ప్రేక్షకుల నుండి మంచి అప్లాజ్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి మఖ్మలీ అని సాగే సాంగ్ టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ లో పృథ్విరాజ్, ఆయన ప్రేయసి రాణి సంయోగిత ల మధ్య ఉండే లవ్ ట్రాక్ ను, వివాహాన్ని చూపించినట్టు తెలుస్తోంది. పృథ్విరాజ్, రాణి సంయోగితల మధ్య ఉన్న బలమైన ప్రేమనుంబంధానికి ఈ గీతం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ సినిమా నుండి విడుదలవుతున్న  పాటల ప్రోమోలను మాత్రమే విడుదల చేస్తున్నారు. పూర్తి పాటలను చూడాలంటే జూన్ 3 న ధియేటర్లకెళ్లాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com