ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ను విడుదల చేసింది. ఎన్టీఆర్ 31 పేరుతో తారక్ చేయబోయే చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఈరోజు మధ్యాహ్నం 12:06 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రొడక్షన్ హౌస్ ప్రకటించింది.
యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. అప్డేట్తో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.