ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసీస్‌ చేతిలో టీమిండియాకు ఘోర పరాభవం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2017, 01:35 AM

-తేలిపోరుున భారత ఆటగాళ్లు
-రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగులేక ఆలౌట్‌  333 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం
-భారత నడ్డి విరిచిన స్పిన్‌ బౌలర్‌ ఒకీఫే  30 టెస్టుల తరువాత భారత్‌కు తొలి పరాజయం


పుణె : తనకంటూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న కోహ్లీ దూకుడు మంత్రి కంగారూల గెంతుడు ముందు నిలువలేకపోయింది. ఇంగ్లాండ్‌, శ్రీలంక, వెస్టిండీస్‌ వంటి మేటి జట్లతో పాటు బంగ్లాదేశ్‌పైనా తనదైన రీతిలో విజయం సాధించిన కోహ్లీసేన అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. కానీ ఆస్ట్రేలి యాపై మాత్రం తన ప్రతాపం కొనసాగించలేకపోయింది. ఆస్ట్రేలియాతో సీరీస్‌ ఆరం భం కాకముందు వరకు కూడా భారత్‌దే పైచేయి అని భావించిన వారి అంచనాలు తారు మారయ్యాయి. అత్యంత నాణ్యమైన స్పిన్నర్లను కలిగి ఉన్న భారత్‌కు అద్భుతాలు సృష్టించే బ్యాట్స్‌మెన్లూ ఉన్నారు. కానీ అవేమీ ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో పనిచేయ లేవు. కనీసం గౌరవప్రదమైన ప్రదర్శన కూడా చేయకుండా సమష్టిగా చేతులెత్తేసింది టీమిండియా. ఏదైతే భారత్‌ బలమనుకునే స్పిన్‌ బౌలింగ్‌ ఉందో...  స్పిన్‌ మంత్రంతో ఆతిథ్య జట్టును కట్టకట్టి చాప చుట్టేసి 333 పరుగుల తేడాతో విజయం సాధించి కోహ్లీ నేతృత్వంలో భారత్‌ సాధించిన 19 వరుస విజయాలకు బ్రేక్‌ వేసింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సీరీస్‌లో 1-0తో ఆస్ట్రేలియా. ఆధిక్యంలో నిలిచింది.
మూడోరోజు అయిన శనివారం నాడు 143/4 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా 285 పరుగులకు ఆలౌటైంది. సారథి స్టీవ్‌ స్మిత్‌ (109) శతకంతో రాణించడంతో ఆసీస్‌ మంచి స్కోరు చేయగలిగింది. సహచర బ్యాట్స్‌మెన్లతో స్వల్ప భాగస్వామ్యాలను నెలకొల్పుతూ స్కోరు బోర్డును ముందుండి నడిపించాడు. భారత బౌలర్లలో అశ్విన్‌ 4, జడేజా 3 ఉమేశ్‌ యాదవ్‌ 2 వికెట్లు దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 155 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని మొత్తం 441 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించింది.
అనంతరం భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన టీమిండియా ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. టీమిండియా ఓపెనర్లు మురళీ విజయ్‌ (2)తో మొదలైన పతనం కడవరకూ కొనసాగింది.  భారత్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగులకే ఆలౌట్‌ కావడంతో మ్యాచ్‌ పూర్తిగా మూడు రోజులు కూడా జరగకుండానే ముగిసింది. భారత ఆటగాళ్లలో చటేశ్వర పూజారా (31) మినహా  ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఆ తరువాత భారత ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌ (10), విరాట్‌ కోహ్లీ (13), అజ్యింకా రహానే (18)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటిన ఆటగాళ్లు. ఏడుగురు భారత ఆటగాళ్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో ఘోర ఓటమి తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో చెలరేగిన ఆసీస్‌ స్పిన్నర్‌ ఓకీఫ్‌ మరోసారి విజృంభించి భారత్‌ వెన్నువిరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఓ కీఫ్‌ ఆరు వికెట్లు సాధించి ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తరువాత లియాన్‌ నాలుగు వికెట్లు తీశాడు. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో పది వికెట్లు స్పిన్నర్లకే దక్కడం ఇక్కడ విశేషం.
ఆ ఒక్కడే రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ జట్టు స్కోరు 10 వద్ద ఓపెనర్‌ మురళీ విజయ్‌ వికెట్‌ కోల్పోయింది. ఆసీస్‌ యువ సంచలన స్పిన్‌ బౌలర్‌ ఓ కెఫీ దెబ్బకు ఒకరివెనుక మరొకరు పెవిలియన్‌ బాట పట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో భారత్‌ను శాసించిన అతడు రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆరు వికెట్లు పడగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో 12 వికెట్లు తీసి టీమ్‌ ఇండియాను ఓటమిలోకి నెట్టేశాడు. భారత బ్యాట్స్‌మెన్లలో పుజారా ఒక్కడే టాప్‌స్కోరర్‌ (31)గా నిలిచాడు. మరోవెపు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన కోహ్లి సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 13 పరుగులకే వికెట్‌ సమర్పించుకున్నాడు. ఏడుగురు బ్యాట్స్‌మెన్లు రెండంకెల స్కోరు కూడా చేయలేదు. ఆసీస్‌ తరఫున స్మిత్‌ ఒక్కడే 109 పరుగులతో రాణిస్తే భారత్‌ జట్టు స్కోరు 107 దాటలేకపోయింది. అత్యధికంగా వికెట్లు తన ఖాతాలో వేసుకున్న కెఫీ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు. 


* కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వదేశంలో టెస్టు
     మ్యాచ్‌ ఓడిపోవడం ఇదే మొదటిది.
* 20 టెస్టుల తర్వాత భారత్‌కు ఇది తొలి పరాజయం.
* రెండో టెస్టు మ్యాచ్‌ మార్చి 4న బెంగళూరులోని చిన్నస్వామి
     స్టేడియంలో ఆరంభంకానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com