నెల్లూరు: కోవూరులోని రామన్నపాలెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి నుండి నెల్లూరు వైపు వెళ్తున్న బైక్ ను వెనుక నుండి కారు ఢీ కొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి కొద్దిదూరం బైక్ తో సహా రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్ళాడు. ఈ క్రమంలో ముందుగా వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ బైక్ ను తప్పించే క్రమంలో రహదారి ప్రక్కన ఉన్న టాటా మ్యాజిక్ ను ఢీ కొట్టాడు. దీంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ట్రాక్టర్ తో పాటు రహదారి పక్కనున్న టాటా మ్యాజిక్ స్వల్పంగా దెబ్బతిన్నాయి. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.