పాయకరావుపేట మండలం వెంకటన గరం, రాజానగరం గ్రామాల్లో సారా నిర్మూలనపై పాయక రావుపేట పోలీసులు సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ పి. ప్రసాదరావు మాట్లాడుతూ సారా తయారు చేసినా, విక్రయించినా నేరమేనన్నారు. అదేవిధంగా రాజానగరం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగా హన కల్పించారు. సర్పంచ్ వంకా వెంకటరమణతో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.