శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య 519 వ వర్ధంతి ఉత్సవాలు మార్చి 28 నుండి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు అన్నమయ్య జన్మస్థలమైన రాజంపేట మండలం తాళ్ళపాక ధ్యాన మందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించనున్నట్లు టిటిడి అధికారులు తెలియజేశారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం వేళ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు.