కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కేవలం శంకుస్థాపనకే పరిమితం అవుతుందని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి లవ కుమార్ పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలోని నేతాజీ కూడలిలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రచారం కోసం కాకుండా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలన్నారు.