ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్‌

international |  Suryaa Desk  | Published : Sat, Mar 19, 2022, 11:45 AM

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సంతోషకరమైన దేశంలో ఫిన్లాండ్‌ మరోసారి టాప్‌లో నిలిచింది. సంతోషంగా ఉండటం అంటే సంపన్నంగా, సర్వసౌఖ్యాలు ఉండటంకాదు సంతోషంగా ఉండటం అంటే మానసిక ప్రశాతంత కలిగి ఉండటం. ఈ జాబితాలో వరుసగా ఐదవ సారి కూడా చిన్నదేశమైన ఫిన్లాండ్ నిలవడం గమనార్హం. ఫిన్లాండ్ తర్వాత డెన్మార్క్ 2వ స్థానంలో నిలువగా, ఐస్ లాండ్ 3వ స్థానంలో నిలిచింది. 4వ స్థానంలో స్విట్జర్లాండ్, 5వ స్థానంలో నెదర్లాండ్స్, 6వ స్థానంలో లగ్జెంబర్గ్, 7వ స్థానంలో స్వీడన్, 8వ స్థానంలో నార్వే, 9వ స్థానంలో ఇజ్రాయెల్, 10వ స్థానంలో న్యూజిలాండ్ దేశాలు టాప్‌-10లో నిలిచాయి. ఇక ఈ జాబితాలో భారత్ 136వ స్థానంలో నిలిచింది. గతం కంటే భారత్ మెరుగు సాధించినట్లుగా తెలుస్తోంది. ఈ జాబితాలో భారత్ కంటే పొరుగుదేశాలు పాకిస్థాన్, శ్రీలంక ముందున్నాయి. పాకిస్థాన్ 121వ ర్యాంకు దక్కించుకోగా, శ్రీలంక 127వ స్థానాన్ని దక్కించుకోవటం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com