ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోహ్లీ టెస్టు కెప్టెన్ గా తప్పుకోవడంపై రవిశాస్త్రి ఘాటు వ్యవాక్యలు

national |  Suryaa Desk  | Published : Tue, Jan 25, 2022, 08:41 PM

కోహ్లీ టెస్టు కెప్టెన్ గా తప్పుకోవడంపైనా రవిశాస్త్రి అభిప్రాయాలు పంచుకున్నారు. "అది అతని ఇష్టం. కోహ్లీ నిర్ణయాన్ని గౌరవించాలి. దేనికైనా ఓ ముగింపు అనేది ఉంటుంది. అనేకమంది దిగ్గజ ఆటగాళ్లు తమ ఆటతీరుపై దృష్టి నిలిపేందుకు కెప్టెన్సీ వదులుకున్నారు. గతంలో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, ఎంఎస్ ధోనీ... ఇప్పుడు విరాట్ కోహ్లీ... ఇది సాధారణమైన విషయమే" అని పేర్కొన్నారు. ఒక్క వరల్డ్ కప్ కూడా నెగ్గనంత మాత్రాన కోహ్లీ ఘనతలను తక్కువ చేసి చూడలేమని, చాలామంది పెద్ద ఆటగాళ్లు తమ కెరీర్ లో వరల్డ్ కప్ లేకుండా వీడ్కోలు పలికారని రవిశాస్త్రి తెలిపారు. సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లేల కెరీర్ లో ఒక్క వరల్డ్ కూడా లేదన్న విషయాన్ని ప్రస్తావించారు. సచిన్ అంతటివాడు కూడా వరల్డ్ కప్ గెలిచేందుకు ఎన్నో సంవత్సరాలు పట్టిందని అన్నారు. ఆరు వరల్డ్ కప్ లు ఆడిన తర్వాత కానీ సచిన్ వరల్డ్ కప్ నెగ్గలేకపోయాడని వివరించారు. కెరీర్ చివరి వరకు ఆటను ఎంత నిబద్ధతతో ఆడామన్నదే ముఖ్యమని, అదే ఆటగాళ్ల కెరీర్ కు కొలమానం అవుతుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఇక, కెప్టెన్సీ విషయంలో కోహ్లీకి, బీసీసీఐకి మధ్య ఏంజరిగుంటుందన్న ప్రశ్నకు బదులిస్తూ, ఏమీ తెలియనప్పుడు నోరు మూసుకుని ఉండడమే మంచిదని హితవు పలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com