ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివాదంలో సింగర్ సునీతా భర్త...గౌడ కులస్థుల తీవ్ర ఆగ్రహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 25, 2022, 03:25 PM

యూట్యూబ్ ఛానళ్లలో వచ్చిన ఓ వీడియోతో టాలీవుడ్ సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన ఆధ్వర్యంలో మ్యాంగో యూట్యూబ్ ఛానల్ నడుస్తోంది. ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ తో ఈ ఛానెల్ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే కొన్ని వీడియోలలో గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారంటూ రామ్ పై గౌడ కుల సంఘాలు మండిపడ్డాయి. అంతేకాదు ఆ యూట్యూబ్ ఛానల్ పై ఈ రోజు దాడికి కూడా యత్నించినట్టు సమాచారం. తమ సామాజికవర్గ మహిళలను కించపరిచేలా తీసిన వీడియోలను వెంటనే డిలీట్ చేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై రామ్ స్పందించాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com