విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామం లో మహిళ అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఉదయం స్థానిక శివాలయం వీధిలో గాడి హారిక (22) ఉరి వేసుకుని మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.