దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 2,55,847 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అయితే మరణాల సంఖ్య పెరిగింది. తాజాగా 614 మంది వైరస్ తో మరణించగా అంతకు ముందు రోజు ఈ సంఖ్య 439గా ఉంది. ప్రస్తుతం దేశంలో 22,36,842 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 15.52 శాతంగా ఉంది.