ఓ మహిళ నాలుక మీద వెంట్రుకలు రావడం వైరల్ గా మారింది. నాలుక మీద వెంట్రుకలు రావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజం. కొలరాడోకు చెందిన ఓ 42 ఏళ్ల మహిళకు స్క్వామస్ సెల్ కార్సినోమా అనే అరుదైన క్యాన్సర్ వచ్చింది. దీంతో తన నాలుకకు డాక్టర్లు సర్జరీ చేశారు. క్యాన్సర్ వల్ల ఇన్ఫెక్షన్ సోకిన నాలుక కొంత భాగాన్ని ఆమె తొడ నుంచి కణజాలాన్ని తీసి రీప్లేస్ చేశారు. అప్పటి నుంచి ఆమె నాలుకపై వెట్రుకలు రావడం ప్రారంభమైంది. ఈ విషయం తెలుసుకున్న వైద్యులు వెంట్రుకలు పెరగకుండా ట్రీట్మెంట్ చేశారు.