ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువకుడిలా కనిపించాలని సర్జరీ.. వృద్ధుడి నరకయాతన!

international |  Suryaa Desk  | Published : Tue, Jan 25, 2022, 12:06 PM

యువకుడిలా కనిపించాలనే తాపత్రయంతో ఓ వృద్ధుడు చేసిన పనికి కళ్లు మూయలేక నరకయాతన అనుభవిస్తున్నాడు. ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హమ్ కు చెందిన పీట్ బ్రాడ్ హర్ట్స్ (79) కొన్నేళ్ల క్రితం పళ్లకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నాడు. దాంతో అతడి బుగ్గల రూపం మారిపోయింది. గమనించిన భార్య అందంగా లేవు అంటూ అతడిని విడిచి వెళ్లిపోయింది. దీంతో ఎలాగైన యువకుడిలా , అందంగా కనిపించాలని 2019 లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. అప్పటి నుండి ఆయన కళ్లు మూయలేకపోతున్నాడు. దాంతో మరో ఆసుపత్రికి వెళ్లగా.. బుగ్గలు, కనురెప్పలు కలిసే చోట చర్మంలో ఇబ్బందిగా ఉందని మరోసారి వైద్యులు సర్జరీ చేశారు. అప్పటి నుండి ఫీట్ కళ్లు అసలు మూతపడటం లేదు. నిద్రపోవాలంటే కళ్లకు చిన్నపాటి టవల్ ను అదికించుకోవడం, లేదంటే టేప్ అతికించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్య నుండి బయటపడేందుకు యూకేలో ఏ ఆసుపత్రి ముందుకు రాకపోడంతో టర్కీకి వెళ్లి మరో సారి సర్జరీ చేయించుకున్నాడు. సమస్య కాస్త తగ్గినప్పటికీ ఎడమ కంటిని ఇప్పటికీ మూయలేకపోతున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com