PRC మరియు వేతనాల పెంపు కొరకు ప్రభుత్వ ఉద్యోగులు రాస్తా రోకోలు, ధర్నాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెయ్యడం గమనిస్తూనే ఉన్నాం. వీరితో ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ వీరి మధ్య వ్యత్యాసం ఉండటం వలన అవి విఫలం ఐయ్యాయి కానీ ప్రభుత్వం మరొసారి పునరాలోచించుకొని ఉద్యోగసంఘాలను మరోసారి చర్చలకు పిలిచినది ఏపీ ప్రభుత్వం. ఈ సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలకు జీఏడీ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ ఆహ్వానం ఇచ్చారు .