ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం మరో కీలక నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Tue, Jan 25, 2022, 11:43 AM

రాబోయే బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. భారత్‌ ఏటా టన్నులకొద్దీ బంగారాన్ని దిగుమతి చేసుకోవడం వల్ల ఏర్పడుతున్న కరెంట్‌ ఖాతా లోటును పూడ్చేందుకు కొత్తగా గోల్డ్‌ సేవింగ్స్‌ అకౌంట్స్‌ను తీసుకురావాలని యోచిస్తోందని సమాచారం. ఈ ఖాతాలో గ్రాము బంగారానికి సమాన మొత్తంలో నగదును బ్యాంకులోని గోల్డ్‌ సేవింగ్స్‌ అకౌంట్స్‌లో మదుపు చేయొచ్చు. గ్రాము నుంచి ఎంత వరకైనా ఇందులో డిపాజిట్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. తిరిగి నగదును ఉపసంహరించుకునేటప్పుడు ఆ రోజు ధర ఆధారంగా బ్యాంకులు చెల్లింపులు చేస్తాయి. ఇందు కోసం బ్యాంక్ పాస్ బుక్ ను కూడా అందించనున్నాయి. బంగారంపై పెట్టుబడులు పెట్టే వారికి ఉపయోగకరంగా ఈ స్కీమ్ ఉండబోతోందని తెలుస్తోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌లో ఈ మేరకు ప్రకటన ఉండే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com