ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజా పోరాటం చేయాల్సింది జగన్‌ పైనే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2017, 01:17 AM

 -అసెంబ్లీ నుంచి సస్పెండైనా తీరు మార్చుకోలేదు


 -రోజా రాజకీయ చరి్త్ర అంతా వివాదాస్పదమే 


 -మంత్రి పీతల సుజాత 


  విజయవాడ, మేజర్‌న్యూస్‌: వైసీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా న్యాయపోరాటం చేయాల్సింది వైసీపీ అధినేత జగన్‌పైనే అంటూ మంత్రి పీతల సుజాత స్పష్టం చేశారు. వైఎస్‌ హయాంలో ఉన్నతాధికారులైన మహిళలు జైలు పాలవడానికి కారణం జగనే అంటూ అందుకు జగన్‌పైనే రోజా న్యాయపోరాటం చేయాలని మంత్రి వివరించారు. మంగళవారం సచివాలయంలో ఆమె మాట్లాడుతూ కృష్ణాగోదావరి పవిత్ర సంగమం వద్ద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన మహిళా పార్లమెంటు సదస్సు విజయవంతం కావడం, ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు లభించడం ఓర్చుకోలేకే వైకాపా నాయుకురాలు రోజా నోరు పారేసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు కష్టపడి పనిచేసే పోలీసులను కించపరిచే విధంగా వైకాపా నాయకురాలు రోజా మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. పోలీసులను బౌన్సర్లతో పోల్చడం తన అహంకారానికి పరాకాష్ట అన్నారు. బౌద్ధమత గురువు దలైలామా, బంగ్లాదేశ్‌ స్పీకర్‌ శర్మిన్‌ చౌదరి, గవర్నర్‌ కిరణ్‌ బేడి, సుప్రీంకోర్టు జడ్జి రోహిణి వంటి మహిళలు హాజరైన సదస్సును కిట్టీ పార్టీతో రోజా పోల్చడం ఆమె అపరిపక్వత కు నిదర్శనమని మండిపడ్డారు.  మరోవైపు ఆ పార్టీకి చెందిన మహిళా ఎంపీ మహిళా సదస్సును, ఏర్పాట్లను మెచ్చుకున్న విషయాన్ని సుజాత గుర్తుచేశారు. ఒకసారి తాను రోజారెడ్డినని, మరోసారి బీసీనని, నేనేమీ ఎస్సీ, ఎస్టీని కాదని పోలీసులనుద్దేశించి మరోసారి మాట్లాడడం రోజాకే చెల్లిందని ఆమె ఎద్దేవా చేశారు. సదస్సును అడ్డుకుంటారనే సమాచారం ఉన్నందుకే పోలీసులు అప్రమ త్తమై వైకాపా నాయకురాలు రోజాను ఎయిర్‌ పోర్టులోనే అడ్డుకుని వారి కు్టన్రు భగ్నం చేశారని, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే చేశారని ఆమె వివ రణ ఇచ్చారు. అభివద్ధి కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి వచ్చే మంచి పేరును అడ్డుకునేందుకు వైకాపా నేతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిన్న మహిళా పార్ల మెంటును అడ్డుకోవడానికి రోజా, మొన్న విశాఖ సమ్మిట్‌ ను అడ్డుకునేందుకు ఎయిర్‌ పోర్టులో జగన్‌ వీరంగం, ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసేందుకు తునిలో రైలు దహనం ఇలా అడుగడుగునా అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుం టూనే ఉన్నారు. రోజా రాజకీయ చరిత్ర అంతా వివాదాస్పదమేనని,  పత్రికల్లో ప్రముఖంగా కనపడాలనే తపన తప్ప రాజకీయ విలువలు కాపాడడానికి, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఆమె ఏ రోజూ కృషి చేయలేదన్నారు. అందరినీ తిట్టడం, ఆ తర్వాత మీడియా ముందు బోరున విలపించడం రోజాకే చెల్లిం దన్నారు. జగన్‌ ప్రోద్బలంతో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ కార్య కలాపాలకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. ప్రజలంటే చులకన.. మీడి యా అంటే లోకువ... అంటూ విమర్శించారు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌ ను కూడా అధిగమించి డ్వాక్రా రుణమాఫీ చేసినందుకు అంగన్‌ వాడీ కార్యకర్తల వేతనాన్ని రూ.4,200 నుంచి రూ.7,000 కు పెంచినందుకు న్యాయ పోరాటం చేస్తావా? 4 లక్షలమంది పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకే గోరు ముద్దలు పథకం పెట్టినందుకు న్యాయ పోరా టం చేస్తావా? కొత్తగా 11 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చి కట్టెల పొయ్యిపై వంట చేసే మహిళ లకు విముక్తి చేసినందుకు నిరసనగా ప్రభుత్వం పై న్యాయ పోరాటం చేస్తారా? తల్లి - బిడ్డ ఎక్‌‌సప్రెస్‌, అన్న అమృత… హస్తం, పసుపు-కుంకుమ, గిరి గోరు ముద్ద లు, మహిళా పోలీస్‌స్టేషన్లు, ఫాస్‌‌ట ట్రాక్‌ కోర్టులు, స్వచ్ఛభారత్‌, జనరిక్‌ మెడికల్‌ షాపులు వంటివి ఏర్పాటు చేసినందుకు న్యాయ పోరాటం చేస్తారా? నిండు శాసనసభలో దళిత మహిళా మంత్రికి చెప్పులు చూపించడం, మహిళా శాసన సభ్యురాలు అనితను అవమానపరచడం, స్పీకర్‌ ను ఫ్యాక్షనిస్టుతో పోల్చడం, మార్షల్‌‌సపై దౌర్జన్యం చేయడం, అసహ్యం పుట్టించే హావభావాలు ప్రదర్శించడం, దేశ విదేశీ ప్రతినిధులు వచ్చే మహిళా సదస్సును అడ్డుకునేలా ప్రయత్నం చేయడం, నగరి మున్సిపల్‌ కమీషనర్‌ బాలాజీపై దాడి చేయడం, ముడుపుల కోసం టోల్‌ గేట్‌ ఉద్యోగులపై దౌర్జన్యం చేయడం, కాంట్రాక్టర్లను బెదిరించడం రోజాకే చెల్లిందన్నారు.  రోజాకు స్వేచ్ఛ ఉంది కనుకƒనే కాబట్టి సెల్ఫీ వీడియో తీసుకోగలిగారని, రోజాను పోలీసులు క్షేమంగా ఇంటి దగ్గర విడిచిపెట్టారని మంత్రి సుజాత తెలియజేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com