ట్రెండింగ్
Epaper    English    தமிழ்

188 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

national |  Suryaa Desk  | Published : Mon, Nov 29, 2021, 02:16 PM

రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ)లో 188 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. 188 పోస్టుల్లో ఎంటీ డ్రైవర్‌, కుక్‌, బూట్‌ మేకర్‌/రిపెయిరర్‌, ఎల్‌డీసీ, వెయిటర్‌, ఫాటిగ్యూమెన్‌, ఎంటీఎస్‌, ల్యాబొరేటరీ, అటెండెంట్‌, బార్బర్‌ తదితర పోస్టులున్నాయి.


అర్హతలు: టెన్త్, ఇంటర్‌ తో పాటు సంబంధిత ట్రేడుల్లో నైపుణ్యంతో పాటు పని అనుభవం ఉండాలి.


వయస్సు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా


పరీక్ష విధానం:


మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు ఉంటుంది. పరీక్ష ఇంగ్లీష్, హిందీలో నిర్వహిస్తారు.


దరఖాస్తు: ఆఫ్‌ లైన్‌


చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌ (నవంబర్‌ 20-26)లో ప్రకటన విడుదలైన 45 రోజుల్లో పంపాలి.


వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com