ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త వైరస్ లక్షణాలివే!

national |  Suryaa Desk  | Published : Mon, Nov 29, 2021, 03:16 PM

ప్రపంచ దేశాలను కరోనా కొత్త వైరస్ ఒమిక్రాన్ గడగడలాడిస్తుంది. గతంలో వచ్చిన డెల్టా వైరస్ కంటే ఇది వేగంగా వ్యాపిస్తుంది. ఒమిక్రాన్ వైరస్ కు సంబంధించి స్పష్టమైన లక్షణాలు బయటపడలేదు. కానీ ఇప్పటి వరకు పాజిటివ్ వచ్చిన వారిలో ఈ లక్షణాలను గుర్తించారు.


వైరస్ బారిన పడినవారిలో తొలుత అలసటగా కనిపిస్తుంది.


ఒంటి నొప్పులు, గొంతులో కొద్దిగా గరరరగా ఉండటం, పొడి దగ్గు, కొద్ది పాటి జ్వరం కూడా ఉంటుంది.


దాదాపు చికెన్ గున్యా లక్షణాలే ఉంటాయి.


గతంలో ఫస్ట్ వేవ్ లో కరోనా సోకిన వారికి, రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కొత్త వైరస్ సోకే ప్రమాదం ఉంది.


కరోనా తొలి వేవ్ లో వైరస్ బారిన పడిన వారికి కూడా ఒమిక్రాన్ సోకవచ్చు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు కూడా వైరస్ సోకే అవకాశం ఉంది. సెకండ్ వేవ్ లో కరోనా బారిన పడిన వారికి ఈ వైరస్ సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వైరస్ సోకినా చాలా మందికి తెలియకుండానే పోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com