ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్మార్ట్‌ఫోన్‌కు ఇన్స్యూరెన్స్ ఉంటే అనేక బెనిఫిట్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 09, 2020, 08:01 PM

మొబైల్ ఇన్సూరెన్స్‌ గురించి అందరికీ అంతగా తెలిసుండదు. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ కొనేవారికన్నా ఖరీదైన, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనేవారికి మొబైల్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ప్రీమియం చెల్లించినట్టు మొబైల్ ఫోన్‌కు బీమా తీసుకోవాలంటే ఎంతో కొంత ప్రీమియం చెల్లించాల్సిందే. వేలకు వేలు ఖర్చు పెట్టి స్మార్ట్‌ఫోన్ కొంటారు. రూ.40 వేలు ఖరీదైనా సరే లెక్కచేయరు. ఆ ఫోన్ పొరపాటున చేయి జారిందంటే డిస్‌ప్లే బద్దలవడం ఖాయం. అంత ఖరీదైన ఫోన్‌కు కొత్త డిస్‌ప్లే వేయాలంటే ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. అదే ఇన్సూరెన్స్ ఉంటే ఇబ్బంది ఉండదు. క్లెయిమ్ చేసుకోవచ్చు. అదొక్కటే కాదు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సమస్యలు వచ్చినా, నీళ్లల్లో పడి ఫోన్ డ్యామేజ్ అయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆథరైజ్డ్ సెంటర్లలో ఫ్రీగా రిపేర్ చేయించుకోవచ్చు. కొన్ని కంపెనీలైతే ఉచితంగానే ఫోన్ పిక్-అప్ అండ్ డ్రాప్ సేవల్ని అందిస్తున్నాయి. దొంగలు మీ ఫోన్ కొట్టేసినా కంప్లైంట్ చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు.ఖరీదైన ఫోన్ కొన్నారంటే స్మార్ట్‌ఫోన్‌ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకుంటేనే మంచిది. రూ.40,000 చెల్లించి మరీ ఫోన్ కొన్నప్పుడు రూ.500 నుంచి రూ.1,000 చెల్లించి ఇన్సూరెన్స్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. అంత ఖరీదైన ఫోన్ దొంగలు కొట్టేసినప్పుడో, పాడైనప్పుడో ఇన్సూరెన్స్ విలువ తెలుస్తుంది. ముందుగానే నియమ నిబంధనలన్నీ పూర్తిగా తెలుసుకున్న తర్వాత ప్రీమియం చెల్లించాలి. ఇంటర్నల్ డ్యామేజ్, ఎక్స్‌టర్నల్ డ్యామేజ్, యాక్సిడెంటల్ స్క్రీన్ డ్యామేజ్, వాటర్ డ్యామేజ్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, థెఫ్ట్, ఫైర్ యాక్సిడెంట్... ఇలా మీ స్మార్ట్‌ఫోన్‌కు పూర్తి కవరేజీ ఉండటం తప్పనిసరి.మొబైల్ ఇన్స్యూరెన్స్‌ పరిధిలోకి రాని అంశాలు కూడా ఉంటాయి. మీ స్మార్ట్‌ఫోన్ అనుమానాస్పదంగా కనిపించకపోయినా, తాళం వేయని ఇల్లు లేదా వాహనం నుంచి ఫోన్ కొట్టేసినా, ఆ ఫోన్ యజమాని కాకుండా ఇతరులు ఎవరైనా ఉపయోగిస్తుండగా పాడైనా ఇన్స్యూరెన్స్ వర్తించదు. మీరు కోపంతో మీ ఫోన్ విసిరినప్పుడు పగిలిపోయినా బీమా వర్తించదు. ఫోన్ రిపేర్ చేస్తున్నప్పుడో, శుభ్రం చేస్తున్న సమయంలో డ్యామేజ్ అయినా ఇన్స్యూరెన్స్ రాదు. ఇలా చాలా అంశాలకు ఇన్స్యూరెన్స్ వర్తించదు. అందుకే నియమనిబంధనలు తెలుసుకోవాలి. మొబైల్ ఇన్స్యూరెన్స్‌ ఇచ్చే కంపెనీలు చాలానే ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ కొన్నవారికి 'కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్' అదే ప్లాట్‌ఫామ్‌పై లభిస్తుంది. మొబైల్ ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మీరు మీ స్మార్ట్‌ఫోన్ ఇన్‌వాయిస్ లేదా బిల్లు, సీరియల్ నెంబర్‌తో ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను సంప్రదించాలి. ఒకవేళ మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినా, పోగొట్టుకున్నా 24 గంటల్లోపు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఆ కాపీని ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌‌కు సబ్మిట్ చేయాలి. 48 గంటల్లోనే క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అయితే మీకు ఎంత మొత్తం తిరిగి వస్తుందన్న విషయం మీరు ఇన్సూరెన్స్ తీసుకునే ముందే నియమనిబంధనల్లో ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com