ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై క్యాట్ లో విచారణ చేపట్టింది. స్టే ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. విచారణ 24కి వాయిదా పడింది. చట్టవిరుద్ధంగా తనను సస్పెండ్ చేశారని క్యాట్ ను ఏబీ వెంకటేశ్వరరావు ఆశ్రయించారు. దేశద్రోహానికి పాల్పడ్డారంటూ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావును 6 రోజుల క్రితం ప్రభుత్వం సస్పెండ్ చేసింది.