విశాఖపట్నం : 2013లో చంద్రబాబు చేపట్టిన మీ కోసం పాదయాత్ర నాటి విశేషాలను ఆయన ఈ రోజు ఒక సారి మననం చేసుకున్నారు. నాడు పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇక్కడ అగనంపూడి వద్ద పైలాన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ పైలాన్ ను ఈ రోజు చంద్రబాబునాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అప్పటి సంగతులను మననం చేసుకున్నారు. పాదయాత్ర ఫోటో ఎగ్జిబిషన్ ను తిలలకించారు.