ఈవీఎంలపై వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందిస్తూ 'వైసీపీకి 151 సీట్లు వస్తే అది మీ విజయమా?.. టీడీపీకి 164 వస్తే ఈవీఎంల గురించి మాట్లాడతారా?' అని ప్రశ్నించారు. 'పులివెందులలో జగన్ రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలి. బ్యాలెట్ పేపర్ విధానంలో ఉప ఎన్నిక పెట్టాలని అందరం ఈసీని కోరదాం. జగన్‌కు మొన్న వచ్చిన మెజారిటీ అయినా వస్తుందో.. రాదో చూద్దాం' అని బుద్ధా సవాల్ చేశారు.