మదనపల్లె పట్టణంలో బక్రీద్ వేడుకలు సోమవారం నిర్వహించారు. ఈద్గాలు, మసీదుల వద్ద మైనార్టీ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జీవన విధానంపై మతపెద్దలు పలు సూచనలు చేశారు. అనంతరం పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పేదలకు దానధర్మాలు నిర్వహించారు. బసినికొండ సమీపంలోని ఈద్గా వద్ద నిర్వహించిన వేడుకల్లో మునిసిపల్ వైస్ ఛైర్మన్ జింక చలపతి పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.