విశాఖ ఋషికొండపై జగన్ నిర్మించిన కట్టడాలపై తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జగన్ సొంత భవనాల్లా రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, రుషికొండ భవనాలపై వాస్తవాలను ప్రజలను గమనించాలని వైసీపీ నేత , మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రుషికొండ భవనాలపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అమరనాథ్ సోమవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు నెలల క్రితమే రుషికొండ భవనాలను ప్రారంభించామని, ఆ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు.