ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దురదుష్టవశాత్తు దివ్యాంగుడికి ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 20, 2023, 11:38 AM

కడప జిల్లా, పెద్దతిప్పసముద్రం,  పీటీఎం పంచా యతీ కుమ్మరవారిపల్లెలో విషాదం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే....  పీటీఎం పంచా యతీ కుమ్మరవారిపల్లెలో దివ్యాంగుడైన లక్ష్మీనారాయణ కుటుంబ పోషణ నిమిత్తం చిల్లర దుకాణాన్ని నిర్వహించుకుంటున్నాడు. ఈనేపథ్యంలో మంగళవారం లక్ష్మీనారాయణ ఓవ్యక్తి ద్విచక్రవాహనానికి పెట్రోల్‌ వేశాడు. ఆపక్కనే ఉన్న వ్యక్తి బీడి అంటించుకోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అతను దివ్యాంగుడు కావడంతో కదలలేని స్థితిలో 90 శాతం కాలిపోయాడు. కుటుంబీకులు బాధితుడిని 108 వాహనం ద్వారా మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com