ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భుజంపై చేయి వేసి మరీ పలుకరించారు. ముందుగా ఇరువురు నేతలూ కరచాలనం చేసుకున్నారు. అనంతరం కుమార స్వామి ప్రమాణ స్వీకారానికి హాజరైన నేతలంతా ప్రజలకు అభివాదం చేసి వెళ్లిపోయే సమయంలో మరోసారి రాహుల్ గాంధీ, చంద్రబాబు ఎదురుపడ్డారు. ఆ సందర్భంగా చంద్రబాబు రాహుల్ భుజంపై చేయి వేసి కరచాలనం చేశారు.