ఒంగోలు, మేజర్‌న్యూస్:పోలీసు శిక్షణా కళాశాల మెడికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్న డాక్టర్ డి. మాసన ఉత్తమ సేవా పురష్కారాన్ని అందుకు న్నారు. ఈ మేరకు మంగళవారం పోలీసు శిక్షణ ఆంధ్రప్రదేశ్ ఐజీ ఎ.రవిచంద్ర, జిల్లా ఎస్పీ డాక్టర్ సి.ఎం. త్రివిక్రమ వర్మ చేతులు మీదుగా అందుకున్నారు. పోలీసు శిక్షణా కళాశాలలో జరుగుతున్న ఎకై్సజ్ కానిస్టేబుళ్ల శిక్షణా సమయంలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను మంగళవారం పోలీసు పెరేడ్ గ్రౌండ్లో జరిగిన ఎకై్సజ్ కానిస్టేబుల్ పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా డాక్టర్ మానసకు ఈ ఉత్తమ సేవా పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పోలీసుల శిక్షణా సమయంలో ఆమె అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎకై్సజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ జోషప్, పోలీసు శిక్షణా కళాశాల ప్రిన్సిపాల్ బి. చాంద్‌నాయక్ తదితరులు ఉన్నారు.