ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మారతారా.. మార్చమంటారా ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2017, 12:25 AM

- రెవెన్యూ శాఖ గాడి తప్పింది...ప్రజలకు నమ్మకం రావాలి
-అక్రమాల అడ్డుకట్టకు త్వరలో బయోమెట్రిక్‌ విధానం
- తహశీల్దారు కార్యాలయాల్లో సీసీ కెమేరాలు, హెల్‌‌పడెస్‌‌కలు
-రెవెన్యూ అవినీతి అధికారులపై మంత్రి కేఈ కృష్ణమూర్తి కన్నెర్ర

విజయవాడ, మేజర్‌న్యూస్‌: ``కొంత మంది రెవెన్యూ ఆధికారుల మూలంగా రెవెన్యూ శాఖకు చెడ్డపేరు వస్తుందని, దీనిని ఇంకా చూస్తూ కూర్చోలేమని, మీరు మారండి, లేకపోతే మార్చాల్సి వస్తుందƒ''ని రెవెన్యూ ఆధికారుల సమీక్ష సదస్సులో ఉపముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి కె.ఈ కృష్ణమూర్తి హెచ్చరించారు. ఉపముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి స్ధానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కృష్ణాజిల్లా రెవెన్యూ ఆధికారుల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆధికారులు ఆలసత్వాన్ని వీడి ఎమ్మార్వో ఆఫీసులలో పరిపాలనాపరంగా మార్పు సంతరించుకునేలాగా చర్యలు చేపట్టాలన్నారు. అపడే ప్రజలకు రెవెన్యూశాఖ మీద నమ్మకం ఎర్పడుతుందన్నారు. రెవెన్యూ సిబ్బందిపై పనిఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది పట్టాదారు పాసుపుస్తకాలు ఉండంగా వాటికి సంబంధించిన భూరికార్డులు కేవలం 670 మంది తాహాశిల్దార్లు నిర్వహిస్తున్నారన్నారు. క్రమశిక్షణకు పేరైన రెవెన్యూశాఖ గత ప్రభుత్వాల కాలంలో గాడి తప్పిందని, దీనివల్ల రైతులు, ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారని, వాటిని గత రెండున్నర సంవత్సరాలుగా సాంకేతిక పరిజ్ణానాన్ని ఉపయోగించి సరిచేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుచూపుతో రెవెన్యూశాఖకు పూర్వవైభవం తేవడానికి ఆధికారులంతా సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. రెవెన్యూలో పారదర్శకతను పెంపొందించడంలో భాగంగా మీభూమి వెబ్‌సైట్‌ను తెలుగులో రూపకల్పన చేసిన ప్రజల ముందు ఉంచామన్నారు. ఇప్పటివరకు ఒక కోటి 75 లక్షల మంది ప్రజలు 4 కోట్ల 31 లక్షల భూరికార్డులను చూశారన్నారు. కొద్ది మంది ఆధికారులు స్వార్ధంతో రెవెన్యూ రికార్డులలో మార్పులు చేస్తున్నారని, దీన్ని సహించమని, ఇలాంటి ఆధికారుల వల్ల రెవెన్యూశాఖకు చెడ్డపేరు వస్తుందని, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. జన్మధ్రువీకరణ పత్రాలు, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఇంటిగ్రేటెడ్గ సర్టిఫికెట్‌, మ్యూటేషన్‌ఈపాస్‌ పుస్తకాలు, ఎఫ్‌లైన్‌ ఫిటిషన్‌ లాంటి 5 సర్వీసులలో అవినీతి ఆధికంగా ఉందని మంత్రి తెలిపారు. మ్యూటేషన్‌కు సంబంధించి రైతులు బయపడాల్సిన అవసరంలేదని, నిర్ణీత 30 రోజుల్లోగా తహశిల్దారు చర్యలు తీసుకోకపోతే ఆటోమ్యూటేషన్‌ జరుగుతుందన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఒక సర్వేయర్‌ సగటున  6 ఎకరాలు సర్వే చేస్తుండగా ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల ఎకరాలు సర్వే చేయాల్సి ఉందన్నారు. తహశిల్దారు కార్యాలయాలలో పారదర్శకత పెంచేందుకు సిసీ కెమెరాలు ఏర్పాటు, హెల్‌‌పడెస్‌‌క, సిటిజన్‌ చార్టర్‌ను తప్పనిసరిగా అమలుచేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. తహశిల్దారు కార్యాలయంలో ఉన్న ఫిర్యాదుల బాక్‌‌సను ప్రజలు, రైతులు ఉపయోగించుకుని ఫిర్యాదులు చేసే తత్వాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. ఫిర్యాదులతో పాటు మొబైల్‌ నెంబర్‌, ఆధార్‌ నెం జతచేస్తే సమస్యపై సత్వరమే స్పందించి న్యాయం జరుగుతుందన్నారు. డిప్యూటి కలెక్టర్‌ స్ధాయి ఆధికారితో ఎన్‌ఫోర్‌మెంట్‌ లేదా విజిలెస్‌‌స వింగ్‌ ఏర్పాటు చేసి ఎమ్మార్వో ఆఫీసులు తనిఖీలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలలో గ్రామానికి సంబంధించిన భూముల సర్వే నెంబర్లు, విస్తీర్ణం, ప్రభుత్వ భూముల వివరాల పట్టిక ప్రదర్శించేలా చర్యలు తీసుకుంటామన్నారు. విఆర్వోలు తప్పనిసరిగా తమకు కేటాయించిన గ్రామాలలో నివాసం ఉండాలనే ఆదేశాలు ఇచ్చిన అవి అమలు కావడం లేదని, గ్రామాలలో నివాసం ఉండని విఆర్వోలను సస్పెండ్గ చేస్తామన్నారు. మండలాలలో సర్వే కోసం డ్రోన్‌ టెక్నాలజీని ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని, సాంకేతిక పరిజ్ణానాన్ని ఉపయోగించి త్వరితంగా  సమస్యలు పరిష్కారం కావడానికి ఆధికారులు కృషిచేయాలన్నారు. రెవెన్యూ ఆసోసియేషన్‌‌స పరిపాలనా పరంగా కొన్ని సమస్యలను తీసుకువచ్చారని, అందులో భాగంగా కలెక్టర్‌ ఆఫీసులో 46 పోస్టులు మంజూరు, ఆర్బన్‌ ప్రాంతాలలో పనిఒత్తిడి తగ్గించడానికి 19 ఆర్బన్‌ మండలాల మంజూరు, 670 డేటా ఎంట్రీ ఆపరేటర్‌‌స రెగ్యులర్‌ పోస్టులు మంజూరు, తాహశిల్దార్లపై ఆకారణంగా క్రిమినల్‌ కేసులు పెడుతున్నారన్న విషయంలో ెంమంత్రితో చర్చించి అలా జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. గ్రామస్ధాయిలో, మండలస్ధాయిలో ప్రజల సమస్యలు సత్వరం పరిష్కారం కావడం లేదని, దానివల్ల వివిధ రీతిల్లో దళారులు పేట్రేగిపోతున్నారని, దానిని అరికట్టాల్సిన అవసరం ఆధికారులపై ఉందన్నారు. రెవెన్యూ సిబ్బంది జిల్లాలలో అన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు                         ఉపయోగించుకుంటున్నామని అన్నారు.  జిల్లాకు సంబంధించి రెవెన్యూ శాఖ అభివృద్ధిని, శాఖాపరంగా జిల్లాలో ఉన్న మంచిచెడ్డులను మంత్రి దృష్టికి జిల్లా సంయుక్త కలెక్టర్‌ గంధంచంద్రుడు సై్లడ్గషో ద్వారా వివరించారు. రెవెన్యూ మీట్‌లో భూపరిపాలన శాఖ ప్రధాన కమీషనర్‌ మరియు రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌ పునీత సదస్సుకు హాజరైన జిల్లా రెవెన్యూ ఆధికారులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.సి శర్మ, రాష్ట్ర సర్వే సెటిల్‌మెంట్‌ శాఖ కమీషనర్‌ వెంకటరామిరెడ్డి, డి.ఆర్‌.వో సి.హెచ్‌.రంగయ్య, ఆర్డివో చక్రపాణి, జిల్లాకు సంబంధించిన ఎమ్మార్వోలు, తదితర ఆధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com