బెంగళూరు : కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బళ్లారికి వచ్చారు. మంత్రి శివకుమార్‌తో సెల్ఫీ దిగేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న మంత్రి.. సదరు యువకుడి చేయిపై బలంగా కొట్టాడు. ఈ క్రమంలో ఫోన్ కూడా కిందపడిపోయింది. మంత్రితో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన మరికొందరు.. తక్షణమే తమ ఫోన్లను జేబుల్లో పెట్టేసుకున్నారు.ఈ మధ్య కాలంలో రాజకీయ నేతలు, సెలబ్రెటీలు కనిపిస్తే చాలు.. సెల్ఫీలు దిగేందుకు కొంతమంది యువకులు ప్రయత్నిస్తుంటారు. ఇలా సెల్ఫీలు దిగడం కొందరికి ఇబ్బందిని కలిగిస్తున్నాయి. ఇందుకు ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం.
#WATCH Karnataka Minister DK Shivkumar slaps away phone of a man who was trying taking a selfie with him in Bellary (4.2.18) pic.twitter.com/iLo6OSyT2Z
— ANI (@ANI) February 5, 2018