ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టికెట్ లేకుండా విమానం ఎక్కి ఆనందించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 08, 2022, 11:57 AM

నిడమానూరు గ్రామం లో ఫ్లైట్ డిన్నర్ కు ఆదరణ విమాన ప్రయాణం అంటే ఇష్టం ఉండని వారు ఉంటారా? అలా గాలిలో ప్రయాణిస్తూ ఆ మేఘాలను చూస్తూ ఉన్న అప్పుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేం , ఇకపోతే విమానంలో విండో సీటు సొంతమైతే చెప్పలేని ఆనందం మన సొంతం అయినట్లే, మరికొంతమంది ఆకాశ వీధుల్లో విహరిస్తూ రుచికరమైన భోజనం చేయడానికి ఇష్టం అంటూ ఉంటారు. కానీ సామాన్యులకు విమానం ఎక్కడం అనేది ఒక కల లాంటిది. దాన్ని ఎప్పుడూ అందని ద్రాక్షగానే భావిస్తుంటారు. ఫ్లైట్ జర్నీ నీ కలలో మాత్రమే ఊహించుకునే వారి కలలు ఇప్పుడు నిజం చేసుకోవచ్చు. టికెట్ లేకుండానే ఫ్లైట్ ఎక్కి వెరైటీస్ ఆఫ్ ఫుడ్డును ఎంత చక్కగా లాగించేయొచ్చు. ఎయిర్ పోర్ట్ కు వెళ్లకుండా బోర్డింగ్ పాస్ తీసుకోకుండా ఫ్లైట్ ఎక్కేయావచ్చు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా ఫ్లైట్ ఎక్కాలంటే గన్నవరం బస్ క్వాలిసిందే , నిడమానూరు యూనియన్ పెట్రోల్ పంప్ పక్కన అందుబాటులో తీసుకొని వచ్చారు.


క్యూ కడుతున్న ఫుడ్ లవర్స్.


నాణ్యమైన భోజనం సరసమైన ధరలకే అందించటం మా లక్ష్యం అంటున్నారు. ఈ రెస్టారెంట్ నిర్వాహకులు, ఈ రెస్టారెంట్లో తెలుగు రుచులు తో పాటు, వెజ్, నాన్ వెజ్ బిర్యానీ, సూప్స్ నార్త్ ఇండియన్ , చైనీస్ వంటకాలు స్వాగతం పలుకుతున్నాయి. ఎయిర్ హోస్టెర్స్ లేకపోయినా ఆప్యాయతతో భోజనం వడ్డించే సర్వర్లు, విమానం గాల్లోకి ఎగిరిన పోయినా విమాన ప్రయాణ అనుభూతి పొందాలనుకునే వారికి ఇదే పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్పవచ్చు. కేవలం రుచికరమైన భోజనం కొరకే కాకుండా ఈ విమానాన్ని చూసి ఎంజాయ్ చేయడం కోసం ఇక్కడ అనేక మంది వస్తుంటారు. ఇక వీకెండ్ వస్తే ఫ్యామిలీ, ఫ్యామిలీ, లు వచ్చి పిల్లలతో కలసి సందడి చేస్తున్నారు. నగరవాసులు విమానంతో సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.


త్వరలోనే పిల్లల కోసం అదిరిపోయే ప్లే ఏరియా. ఏడాదిన్నర క్రితం ఈ విమానాన్ని వేలంలో తీసుకుని రెస్టారెంట్ గా మార్చమని గత అరునెలలుగా నగర వాసులు అందుబాటులోకి వచ్చింది అంటున్నారు. నిర్వాహకులు రవి శంకర్, ఇంకా కొన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని త్వరలోనే పిల్లలకోసం ప్లేయింగ్ ఏరియా సుందరంగా తీర్చిదిద్దుతామని వెయిటింగ్ హాల్స్ కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు. అతి తక్కువ కాలంలో ఇంత ఆదరణ పొందటం చాలా సంతోషం గా ఉందని, విమాన అనుభూతి పొందాలి అనుకునే వారికి ఈ రెస్టారెంట్ స్వాగతం పలుకుతుంది అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com