ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ విషయాలు మీకు తెలుసా...!

Life style |  Suryaa Desk  | Published : Mon, May 30, 2022, 10:59 PM

--- రాత్రి నిద్ర పోయేముందు ఒక స్పూను సోంపును రెండు బాదం పప్పులతో కలిపి తింటే, మెరుగైన కంటిచూపు మీ సొంతం. 


--- యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటీని కనుగొన్న శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్ అని అందరికి తెలుసు. తెలియని విషయమేంటంటే, ఆ సిద్ధాంతాన్ని కనుగొనేటప్పటికి ఆయన వయసు కేవలం 23 సంవత్సరాలేనంట. బ్రహ్మచారిగానే న్యూటన్ మరణించాడట. 


---కోడిని పూర్తిగా నేలమీద పడుకోబెట్టి, దాని తల నుండి ఒక సరళరేఖను గీసుకుంటూ వెళ్తే, అరగంట పాటు కోడి హిప్నటైజ్ కు గురవుతుంది. 


--- సినిమాల్లో చూస్తుంటాం కదా... బాంబుకుండే పిన్నును హీరో అలవోకగా తన నోటితో తీసేసి విలన్ల మీద వేసి వారిని మట్టుపెడతాడు. నిజానికి బాంబులకుండే పిన్ను చాలా బలంగా ఉంటుంది. నోటితో తియ్యాలని ప్రయత్నిస్తే చేతికి పళ్లూడొస్తాయి కానీ ఆ పిన్ను మాత్రం అక్కడే ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com