ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళపై అత్యాచారయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 01:18 PM

చిత్తూరు:పూతలపట్టు మండలంలోని ముంగర మడుగుకు చెందిన మహిళ(38)పై అదే గ్రామానికి చెందిన సాయికుమార్‌(27) అత్యాచారానికి యత్నించినట్లు ఎస్సై మల్లికార్జునరెడ్డి బుధవారం తెలిపారు. ఆయన కథనం మేరకు. బాధిత మహిళ మంగళవారం అర్ధరాత్రి బహిర్భూమికని గ్రామ సమీపంలోని ఖాళీ స్థలానికి వెళ్లగా. నిందితుడు ఆమెను వెంబడించి అత్యాచారానికి యత్నించాడు. ఈ క్రమంలో మహిళ ప్రతిఘటించడంతో దాడి చేశాడు. బాధితురాలి కేకలు వేయడంతో గ్రామస్థులు అక్కడి చేరుకోగా అప్పటికే నిందితుడు పారిపోయినట్లు ఎస్సై పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com