ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాట్సాప్‌ లో ఈ కొత్త ఫీచర్‌ గురించి మీకు తెలుసా..?

national |  Suryaa Desk  | Published : Fri, May 13, 2022, 06:12 PM

వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ ను యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకురానుంది. యూజర్లు సులువుగా తమ చాట్స్‌ ను గుర్తించేలా 'చాట్‌ ఫిల్టర్‌' అనే కొత్త ఫీచర్‌ ను తీసుకురానున్నట్లు వాబీటాఇన్ఫో తెలిపింది. దీనిలో కాంటాక్ట్స్‌, గ్రూప్స్‌, నాన్‌-కాంటాక్ట్స్‌, అన్‌ రీడ్‌ చాట్స్‌ అనే 4 కేటగిరీలు ఉంటాయి. యూజర్లు కావాల్సిన దానిని వెతికే పని లేకుండా సులువుగా గుర్తించేలా అన్నింటినీ ఒకే ట్యాబ్‌ లో అందించనుంది.

దీంతో ఈజీగా మనకు కావాల్సిన పాత చాట్‌ మెసేజ్‌ లను వెతకొచ్చు. అయితే వాట్సాప్‌ లో ఈ కొత్త ఫీచర్ ఎప్పుడు వస్తుందనే దానిపై క్లారిటీ రాలేదు. ఈ ఫీచర్‌ అప్‌డేటెడ్‌ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌, డెస్క్‌ టాప్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వస్తుందని వాబీటాఇన్ఫో తెలిపింది. దీనికి సంబంధించి స్క్రీన్‌ షాట్‌ ను విడుదల చేసింది. ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com