ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాసా సరికొత్త ఆలోచన...

international |  Suryaa Desk  | Published : Wed, Apr 28, 2021, 12:48 PM

నాసా ఇటీవలే రోవర్ ను మార్స్ మీదకు పంపిన సంగతి తెలిసిందే. నాసా పంపిన రోవర్ మార్స్ మీద విజయవంతంగా దిగిన సంగతి విదితమే. అయితే, రోవర్ లో అమర్చిన మోక్సి అనే ప్రత్యేక పరికరం అంగారకుడిపై ఉన్న కార్బన్ డై ఆక్సయిడ్ ను సేకరించి ప్రత్యేక రసాయన విద్యుత్ చర్యల ద్వారా ఆక్సిజన్ ను తయారు చేసింది. ఐదు గ్రాముల ఆక్సిజన్ ను తయారు చేసింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో నాసా శాస్త్రవేత్తలు మరో కొత్త ప్రయోగం చేయబోతున్నారు. భవిష్యత్తులో నలుగురు వ్యోమగాములు మార్స్ మీదకు వెళ్లి రావాలి అంటే కనీసం 25 వేల కిలోల ఆక్సిజన్ అవసరం అవుతుంది. అంత పెద్ద మొత్తంలో ఆక్సిజన్ ను అక్కడికి నిత్యం తీసుకెళ్లడం కష్టం అవుతుంది. అందుకే ఒక టన్ను బరువుండే ఆక్సిజన్ తయారీ యంత్రాన్ని మార్స్ మీదకు పంపాలనే ఆలోచన చేస్తోంది నాసా. మార్స్ మీదకు ఆక్సిజన్ తయారీ పరికరాన్ని పంపి ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తే ఎవరుఅక్కడికి వెళ్లినా ఆక్సిజన్ కు ఇబ్బంది ఉండదు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com