ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆమె గుండెను బ్యాగులో పెట్టుకుని బ్రతికేస్తోంది...!

international |  Suryaa Desk  | Published : Tue, Apr 20, 2021, 08:56 AM

యూకేకు చెందిన సెల్వా హుస్సెన్ అనే మహిళ తన గుండెను ఒక బ్యాగులో పెట్టుకుని బ్రతికేస్తోంది. 2017 లో కారు నడుపుతూ ఆమె శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె గుండె ఫెయిలయ్యిందని చెప్పారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆమెకు కృత్రిమ గుండెను అమర్చారు. ఆ గుండె పనిచేయడానికి ప్రత్యేక కంట్రోల్ యూనిట్ ‌ను ఆమె వెనుక ఏర్పాటు చేశారు. దానితో పాటు మరో యూనిట్‌ ను ఆమె వెనుక బ్యాగ్‌ లో అమర్చారు. ఇవి రెండు ఆమె గుండె పనిచేయాడానికి సహాయపడతాయి. ఎప్పుడైనా, మొదటి యూనిట్‌ పనిచేయకపోతే.. రెండో యూనిట్‌ దాని స్థానంలో పనిచేస్తుంది. ఆమె బయటకు వెళ్లాలంటే ఆమె వెంట ఖచ్చితంగా ఒకరు తోడుగా ఉండక తప్పదు. ఈ కృత్రిమ గుండె ఆమె శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతోంది. ఆమె కడుపు నుంచి ప్రత్యేక పైపులు..మొదటి యూనిట్‌ కు, రెండో యూనిట్‌ కు లింక్ చేసి ఉన్నాయి. దీంతో శరీరంలోనికి రక్తం పంపింగ్‌ చేయబడుతుంది. చాలా కొద్ది మందికి మాత్రమే అరుదుగా ఇలాంటి వ్యాధి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. దీన్ని వైద్యపరిభాషలో కార్డియోమయోపతి అంటారని తెలిపారు. ఈ కృత్రిమ గుండె ఖరీదు 86 వేల పౌండ్లు (భారత కరెన్సీలో రూ.88.72 లక్షలు). హేర్ఫీల్డ్ ఆసుపత్రి వైద్యులు దాదాపు 6 గంటల పాటు శ్రమించి ఈ గుండెను అమర్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com