అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి మాస్కు ధరించి కనిపించాడు. కరోనా ప్రభావం పెరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రంప్ మాస్కు పెట్టుకొని కనిపించలేదు. ముఖానికి మాస్కు ధరించాల్సిన అవసరం కూడా లేదని ఆయన అనేక సందర్భాల్లో అన్నారు. ఇటీవల ట్రంప్ మేరీల్యాండ్‌లోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరి మెడికల్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ ఆస్పత్రి నిబంధనల ప్రకారం తప్పనిసరి మాస్కు ధరించాలి. దీంతో ట్రంప్ మాస్కు ధరించాడు. ఎట్టకేలకు ట్రంప్ మాస్కు ధరించడంతో రిపబ్లికన్ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. అమెరికాలో ఇప్పటి వరకు 33 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా కరోనా బారిన పడి లక్షా 36 వేల మందికి పైగా మరణించారు.